Agnyathavaasi Trailer Release date Confirmed

0
510

అజ్ఞాతవాసి..ఎప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు..బుకింగ్స్ కూడా కనివిని ఎరుగని రీతిలో జరుగుతున్నాయి..అమెరికా లో అయితే అజ్ఞాతవాసి మూవీ బుకింగ్స్ ఇంగ్లీష్ మూవీస్ తో పోటీ పడుతూ టాప్ 5 లో ట్రెండ్ అవుతున్నాయి…చరిత్రలో ఒక్క తెలుగు సినిమాకి అలా జరగడం ఇదే తొలిసారి..

ఒక్క పక్క అజ్ఞాతవాసి ఈ స్థాయి లో రికార్డులు సృష్టిస్తున్న కానీ అభిమానులు ఆనందంలో లేరు..కారణం అజ్ఞాతవాసి ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వకపోవడమే..విడుదలకి సరిగ్గా నాలుగు రోజులు కూడా లేకపోవడం..ఇప్పటికి ట్రైలర్ ఎప్పుడు విడుదల అవ్వబోతుందో ప్రొడక్షన్ టీం నుండి ఒక్కరు కూడా స్పందించకపోవడం..అభిమానులకి తీవ్ర నిరాశ కలిగిస్తుంది..ట్రైలర్ సంగతి పక్కన పెడితే కనీసం పోస్టర్స్ కూడా విడుదల చెయ్యకపోవడం అభిమానులకి చిరాకు రప్పిస్తుంది

అభిమానుల కోరిక మేరకు మా వెబ్సైట్ ప్రతినిధులు అజ్ఞాతవాసి మూవీ ప్రొడ్యూసర్స్ కి ఫోన్ చేసి అసలు ఏమి జరుగుతుందో కనుకున్నాం..వాళ్లు చెప్పిన సమాచారం ప్రకారం..”అజ్ఞాతవాసి ట్రైలర్ కట్ ఇంతకు ముందే చేసాము..కానీ అది త్రివిక్రమ్ గారికి నచ్చలేదు..కొత్త ట్రైలర్ కట్ సిద్ధం చేసారు..కానీ దానిని సెన్సార్ చేయడానికి సెన్సార్ సభ్యుడు లేదు..అయన స్తానం లో వేరొక్క సబ్యడు సోమవారం వస్తాడు..కాబట్టి ట్రైలర్ ని సెన్సార్ కి సోమవారం పంపిస్తాము..సోమవారామె ట్రైలర్ విడుదల అవ్వొచ్చు..ప్రస్తుతం టీం మొత్తం ప్రీ – ప్రొడక్షన్ వర్క్ లో 24 గంటలు విరామమే లేకుండా పని చేస్తున్నం ” అని చెప్పారు

కాబట్టి అభిమానులు ఇంకా శాంతించండి..టీమ్ మొత్తం ప్యాచ్ వర్క్ లో చాల బిజీ గ ఉన్నారు..అయినా పవన్ కళ్యాణ్ సినిమాకి ట్రైలర్ తో అవసరం ఏమి ఉంది,.?? అసలు అభిమానులలో అంచనాలు ఏమి మాత్రం లేని కాటంరాయుడు లాంటి మూవీ తోనే మొదట రోజు రికార్డుల దుందుభి మోగించాడు..ఎప్పుడు అంచనాలు తారాస్థాయి లో ఉన్న అజ్ఞాతవాసి చిత్రం ఏ స్థాయి లో రికార్డులు సృష్టిస్తుందో మీ ఊహలకే వదిలేస్తున్నాము..

అజ్ఞాతవాసి మూవీ కి సంబంధించిన ఆ మరికొన్ని పూర్తి వివరాల కొరకు ఈ క్రింది వీడియో చూడండి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here