అభిమానికి తీవ్ర గాయాలు..స్వయంగా తన కారులో హాస్పిటల్ కి తీసుకొని పోయిన పవన్ కళ్యాణ్

0
416

అనంతపురం జిల్లా, పుట్టపర్తి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి తన దేశం అన్న..అభిమానులు అన్న ఎంత ప్రాణమో మన అందరికి తెలిసిందే..అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఎలా ఆరాధిస్తారో,పవన్ కళ్యాణ్ గారు కూడా అభిమానులని అలాగే ఆరాధిస్తారు..ఈరోజు అనంతపురం కరువు పర్యటనలో భాగంగా పుట్టపర్తికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి అభిమానులు ఎగబడడం తో కోడికి పాటి తోపులాట జరిగింది.. దానివల్ల అదుపు తప్పిన ఒక్క అభిమాని పవన్ కళ్యాణ్ కాన్వాయి కి గుద్దుకొని తీవ్ర గాయాలకు గురి అయ్యారు..ఇది గమనించిన పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన వెంటనే గాయపడ్డ ఆ అభిమానిని తన కారులో ఎక్కించుకొని స్థానిక హాస్పిటల్ లో జాయిన్ చేసారు..ఇది ఇలా ఉండగా ఈరోజు సాయంత్రం ఆయన పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి బాబా శాంతి నిలయం ని దర్శించుకున్నారు..దానికి సంబంధించిన వీడియో ఈ క్రింది వీడియో లో చూడండి

ఈరోజుతో పవన్ కళ్యాణ్ గారు అనంతపురం జిల్లా మూడు రోజుల పర్యటనలో భాగంగా తన రెండవ రోజు పర్యటనని ముగించుకున్నారు..ఈ రెండు రోజుల పర్యటన లో అయన ముఖ్యంగా కరువు ప్రాంత రైతుల కష్టాలను,వారి సమస్యల గురించి అధ్యయనం చేసుకోడంలో నిమగ్నమయ్యారు..ఇందులో భాగంగా అనంతపురం కరువు ప్రాంతం లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం మంత్రి పరిటాల సునీత గారిని కలిశారు..ఆమె మాట్లాడిన మాటలు ఈ క్రింది వీడియోలో చూడండి

భేటీ అనంతరం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడారో మీరే చూడండి ఈ క్రింది వీడియోలో

ఈ మూడు రోజులు అనంతపురం కరువు ప్రాంతాల సమస్యల అధ్యయనం తరవాత పవన్ కళ్యాణ్ గారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తాని సేకరించిన సమస్యల వివరాలను తెలియచేయనున్నారు..మరిన్ని పూర్తి వివరాల కోసం మా వెబ్ సైట్ ని ఫాలో అవుతూ ఉండండి

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here