ఇది చదివితే ఆపిల్ కంటే జామాకాయ లో లాభాలు ఎక్కువ అంటారు!

0
38

ఇది జామకాయల సీజన్,జామపండు తినటానికి అందరు ఇష్టతారు, కానీ దీని వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆర్చర్యానికి గురవుతారు జామపండు తింటే ఇక ఆరోగ్యం మీచేతిలో ఉన్నట్టే. ఇది ఎవరో చెబుతున్నది కాదు, స్వయానా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఒక జామకాయ తింటే పది ఆపిల్స్ తిన్నదానితో సమానమంటున్నారు వారు.మన దగ్గర విరివిగా తక్కువ ధరలో అందుబాటులో ఉండే జామకాయ అంటే మనము చిన్నచూపు చూస్తుంటాం. తినడానికి అనాసక్తి చూపుతుంటాం. కానీ జామలో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని, ఎన్నో వ్యాధుల నివారణకు దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చేది జామకాయల సీజన్. విరివిగా మనకు అందుబాటులో ఉండనున్నాయి. ఇష్టంగా తిని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

1.వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది . శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్ గా ఉపయోగపడుతుంది, కణజాలము పొరను రక్షిస్తుంది2.కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది,జామ ఏడాది పొడవునా అడపాదడపా లభిస్తున్నా శీతాకాలం లోనే వీటి రుచి బలే గమ్మత్తుగా ఉంటుంది . ప్రపంచంలో అన్ని దేశాలలోను లభిస్తుంది . . ఆసియా దేశాలలో విసృఉతంగా పండుతుంది ౩)కమలా పండులో కంటే ఇదు రెట్లు అధికంగా విటమిను ” సి ” ఉంటుంది . ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయలో ఉంటుంది . చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే ” కొల్లాజన్ ” ఉత్పత్తికి ఇది కీలకము, కొవ్వు మెటబాలిజాన్ని ప్రభావితం జేసే ” పెక్టిన్” జామలో లభిస్తుంది .

4)ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది . జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు . జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు.

5.నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు.ఇక జామపండు పై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది.6)జామకాయలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం .

7.అలాగే జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు.8) కంటి సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here