యాపిల్ పైన ప్రమాదకరమైన వాక్స్(మైనం) గుర్తించడం ఎలా?దానిని తొలగించడం ఎలానో తెలుసా?

0
267

యాపిల్ పండులో ఏ, సీ విటమిన్లు, రాగి వంటి పోషకాలుంటాయి..ఆపిల్‌లోని పెక్టిన్ శరీరంలోని కొవ్వు పదార్థాలను నిర్మూలించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. సేపులోని మినరల్స్, పొటాషియం రక్తపోటును నివారిస్తాయి. ఆపిల్‌లో న్యూరోట్రాన్స్‌మీటర్ ఎసిటైల్ అధిక మోతాదులో ఉండడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. రోజుకో ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతారు. కానీ, అదే ఆపిల్ ఆసుపత్రిపాలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇందుకు కారణం ఆపిల్ కాదు. దానిపై ఉండే మైనం (వ్యాక్స్) పూత. కొంతమంది కక్కుర్తి వ్యాపారులు.. ప్రభుత్వం సూచించిన విధంగా కాకుండా విషతుల్యమైన మైనాన్ని ఆపిల్ పండ్లకు వినియోగిస్తున్నారు.ఆపిల్ పండ్లు తాజాగా, మెరుస్తూ కనిపించేందుకు వ్యాపారులు పారాఫిన్ అనే మైనాన్ని వినియోగిస్తున్నారు. వాస్తవానికి తేనెతుట్టె నుంచి వచ్చే హానీబీ వ్యాక్స్ , చెట్లు సూక్ష్మజీవుల నుంచి సేకరించే సెల్లాక్, కార్నబా వ్యాక్స్‌ను మాత్రమే ఆపిల్ పండ్లకు వినియోగించాలి. అయితే, అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో తక్కువ ధరకు వచ్చే పారాఫిన్‌ను వాడుతున్నారు.పండ్లలో నీటి శాతాన్ని కాపాడేందుకు వ్యాక్స్‌ను వాడుతారు. దాన్ని మండించగా వచ్చే ఆవిరిని ఆపిల్ పండ్లకు పడతారు.కొవ్వుత్తుల వినియోగంలో వాడే మైనం పండ్లతో కడుపులోకి వెళ్తే.. జీర్ణ వ్యవస్థ దెబ్బతినడంతోపాటు.. పెద్ద, చిన్న ప్రేగులు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులతోపాటు అల్సర్సులు, ప్రభలే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మరి, వాటి బారిన పడకుండా ఉండాలాంటే.. వ్యాక్స్‌ను తొలగించి ఆపిల్ పండ్లను తినడమే ఉత్తమం. అదెలాగో చూడండి.
1.మైనం కోటింగ్ కలిగిన ఆపిల్ పండ్లను కొన్ని సెకన్ల పాటు వేడి నీళ్లలో ఉంచాలి. వాటిని బయటకు తీసిన తర్వాత చల్లని నీటితో కడగాలి.
2.ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను నీటిలో కలిపాలి. ఆపిళ్లను అందులో ముంచి, బ్రష్‌తో తోమాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి.
3. నిమ్మరసం స్థానంలో వెనిగర్ కూడా వాడవచ్చు. రెండో సూచనలో చెప్పినట్లే.. ఆపిళ్లను శుభ్రం చేసి, నీటితో కడగాలి.4. ఆపిల్ సీడర్ వెనిగర్ కూడా పండ్లపై వ్యాక్సిన్‌ను తొలగిస్తాయి. ఆపిళ్లను ఈ ద్రావణంలో ముంచి టిష్యూ లేదా శుభ్రమైన క్లాత్‌తో రుద్దాలి. తర్వాత నీటితో శుభ్రంగా కడిగి ఆరగించాలి.
కొంతమంది మైనం తొలగించడం కోసం పై తొక్కను పూర్తిగా తొలగిస్తారు. అయితే, దీనివల్ల ఆపిల్‌ తొక్కలో ఉండే పోషకాలు, ఫైబర్ శరీరానికి అందవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here