ప్రపంచం లో ఏకైక వెజిటేరియన్ మొసలి !నాన్ వెజ్ తాకదట

0
17

 మొసలి పక్కా శాఖాహారి అంటే నమ్ముతారా?అవును మీరు విన్నది నిజం అసలు, మాంసమే రుచి చూడని ఈ మొసలిని స్థానికులు దైవంగా భావిస్తారు. ఓ ఆలయానికి కాపలా కాస్తూ.. సాధు జీవితం గడుపుతున్న ఈ మొసలి… శాఖాహరిగా మారడం వెనుక పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. మరి, ఈ మొసలని మీకు కూడా చూడాలని ఉందా? అయితే, కేరళాలోని కసరగడ్ జిల్లాలో గల అనంతపురకు వెళ్లాల్సిందే.ఈ సరస్సులో ఉంటున్న మొసలి నిత్య శాఖాహారి. ఆ ఊర్లోవాళ్లంతా దీన్ని బబియా అని పిలుస్తారు. ఈ సరస్సును ఆనుకుని ఉన్న ఆలయానికి ఈ మొసలి కాపలా కాస్తుంది. రోజు గుడిలో ప్రసాదం తప్ప మరే ఆహారం తినదు.మొసలి ఇలా శాఖాహారిగా మారడం వెనుక పురాణాల్లో ఓ కథ ఉందని స్థానికులు చెబుతున్నారు.
శ్రీ విష్ణువు కోసం ఘోర తపస్సులో ఉన్న విల్వమంగలతు స్వామి భక్తిని పరీక్షించేందుకు కృష్ణుడు బాలుడి రూపంలో వస్తాడు. విల్వమంగలతుతో పరాచకాలు ఆడతాడు. దీంతో, ఆ బాలుడిని పక్కకు నెట్టేస్తాడు. తన తప్పును తెలుసుకునేసరికి కృష్ణుడు ఓ చిన్న గుహాలోకి వెళ్లిపోతాడు. ఆ గుహ ఈ ఆలయంలోనే ఉందని, దానికి కాపలాగా విల్వమంగలతు మొసలిని ఏర్పాటు చేశాడని చెబుతుంటారు.దాదాపు 70 ఏళ్ల కిందట ఓ బ్రిటీష్ సైనికుడు ఈ సరస్సులో ఆలయానికి కాపలాగా ఉన్న మొసలిచి చంపేశాడు. అయితే, అతను కొద్ది రోజుల తర్వాత పాముకు గురై చనిపోయాడు. దైవమే అతన్ని చంపిందని స్థానికులు చెబుతుంటారు. చిత్రం ఏమిటంటే.. ఆ మొసలి చనిపోయిన కొద్ది రోజులకే మరో మొసలి వచ్చింది. అలా.. కొన్నేళ్లుగా ఒక మొసలి చనిపోయిన వెంటనే మరో మొసలి ప్రత్యక్షమవుతూ గుడికి కాపలాగా ఉంటున్నాయి. నిజంగా ఇది చిత్రమే కదూ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here