మన చిల్కూరు లాగే అక్కడ వీసా దేవుడు!ఇక్కడ ప్రసాదం ఏంటో తెలిస్తే ఆశర్యపోతారు!

0
266

మన చిల్కూరు బాలాజీ  కి వీసా దేవడు అనే పేరు ఉంది మనలోచాలా మందికి విదేశీ ప్రయాణం ఒక కల. దాన్ని నెరవేర్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా విదేశాలు వెళ్లాలంటే కావాల్సింది వీసా. అందుకే కాబోలు పంజాబ్‌లో సిక్కులు ఏకంగా విమాన దేవాలయం నిర్మించారు. ఇందులో దైవానికి వీసాదేవుడని పేరు కూడా పెట్టి ఆలయంలో పూజలు చేస్తున్నారు. అక్కడ భక్తులు బొమ్మ విమానాలనే కానుకలుగా సమర్పించుకుంటారు.హవాయూ జహాజ్ గురుద్వారాగా పిలిచే ఈ సిక్కు దేవాలయం పంజాబ్‌లోని జలంధర్ తల్‌హాన్‌లో ఉంది. ఒకప్పుడు షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారాగా పిలిచే ఈ పంజాబీ ఆలయాన్ని ప్రస్తుతం హవాయూ జహాజ్ గురుద్వారాగా పిలుస్తున్నారు. స్థానిక జాట్ కమ్యూనిటీ, దళిత వర్గాల ప్రజలు వందేళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు.మీకు వింత అనిపించవచ్చుకానీ పంజాబ్లోని ఈ గురుద్వారా మీ ప్రార్థన సమయంలో మీ వీసా ఆమోదం పొందగలరని మీరు విశ్వసిస్తారు! పంజాబ్లోని జలంధర్ నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరం లో ఉన్న చిన్నన్ గ్రామంలో స్థానికులు దీనిని పిలిచేవారు, ‘ఎయిర్ప్లేన్ గురుద్వార్’ హవాజహాజ్ గురుద్వారకు స్వాగతం. ఇక్కడ భక్తులకు విమానం బొమ్మనే ప్రసాదంగా ఇవ్వడం మరో విశేషం.ఇలా ఇస్తే వారికి త్వరగా వీసా లభిస్తుందని నమ్మకం. అంతేకాక విమాన ప్రయాణంలో ఎటువంటి అపదలూ లేకుండా రక్షణ కలుగుతుందని నమ్మకం.విదేశీ ప్రయాణం కోరుకునేవారు ఈ గుడిలో విమానం బొమ్మ కూడా సమర్పించుకోవాలి. ఇక్కడి షాపుల్లో ఎయిర్ ఇండియా, బ్రిటిష్ ఎయిర్‌వేస్, లుఫ్తాన్సా లాంటి విమానాల బొమ్మ నమూనాలు తయారు చేసి అమ్ముతారు. ఒక్కొక్కటి  రూ. 50 నుంచి 500 రూపాయల వరకు ఉంటాయి. ఇలా రోజూ కొన్ని వందల బొమ్మలు అమ్ముడవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here