ఈ కాలం లో ఎక్కువ దొరికే ఉసిరి వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు.

0
260

చలికాలం లో మనకు లబించే కాయ ఉసిరికాయ.  వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రోజుకు ఒక ఉసిరికాయ తీనె వారికీ ఆరోగ్య రిత్య ఏంటో మేలు చేస్తుంది. మన ఉసిరికయనె గూస్ బెర్రీ అనికూడా అంటారు. దీని పేరు లాగా ఇవి చాల పుల్లగా ఉంటాయి. ఇవి అక్కుపచగా ఉంటాయి అలాగే వీటిలో చాల సుగుణాలు కూడా ఉన్నాయి. అందుకే మన పూర్వికులు ఎపటినుంచో వీటి గురించి చెపుతూనే వున్నారు. విటమిన్ సి ఎక్కువుగా ఉండే పదార్దం ఈ ఉసిరికాయ.ఈ ఒక్క కాయ రొండు నారింజ పండ్లతో సమానం.ఉసిరి తీపి, పులుపు రుచుల కలయిక గలది. ఉసిరి త్రిదోషాలను క్షమింపజేస్తుంది. కఫం, వాతం, పైత్యం, పైత్యభ్రమ, మేహ మూల వ్యాధులను హరిస్తుంది. జీర్ణాశయానికి, గుండెకు కలుగజేస్తుంది. వయస్సును, తేజస్సును నిలుపుతుంది. దీంతో ఆయుర్వేద పరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రకృతి ప్రసాదించిన సంపదలో ఉసిరికాయ కూడా ఒకటి. ఉసిరి విటమిన్ ‘C’ని పుష్కలంగా కలిగి ఉండి, జలుబు, క్యాన్సర్ మరియు గుండె సంబంధిత వంటి సాధారణంగా, సహజంగా కలిగే వ్యాధులను తగ్గిస్తుంది. విటమిన్ ‘C’ లోపం వలన వారు దీన్ని  తినటం వలన త్వరగా కోలుకునే అవకాశం ఉంది.ఉసిరి, కొవ్వు పదార్థాలను తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తుంది. ఉసిరిని తినటం వలన రక్తనాళాలలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులను కలగకుండా చేస్తుంది.ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార ప్రణాలికను తయారు చేసుకునే పట్టికలో ఉసిరిని కూడా కలపండిచేదుగా మరియు పుల్లని రుచి ఉండే ఉసిరిని తినటం వలన జీర్ణవ్యవస్థలోని రిసెప్టార్’లను ఉత్తేజ పరచి, జీర్ణక్రియ ఎంజైమ్ ఉత్పత్తిని పెంచుతుంది. అధిక మొత్తంలో ఫైబర్’లను కలిగి ఉండటం వలన జీర్ణక్రియ సమస్యలను సులభంగా తగ్గిస్తుంది. పేగు కదలికలను మెరుగుపరచటమే కాకుండా జీర్ణక్రియ అవయవాలను శుభ్రపరుస్తుందిఉసిరికాయ తినటం వల్ల సరిరం లోని రెడ్ బ్లడ్ సెల్ల్స్ పెరుగుతాయి.ఉసిరికాయ తినటం వల్ల ఎముకలు గట్టిగ ఉంటాయి.ఉసిర్కయ తినటం వల్ల ఆడవాళ్ళలో ఉండే మెన్స్త్రుఅల్ ప్రొబ్లెమ్స్ తగ్గుతాయి.ఉసిరికాయ మరియు జామకాయ తినటం వల్ల మదుమేహం నూ అదుపులో ఉంచుకోవాచు.ఎవరైతే గ్యాస్ సమస్యతో బాద పడుతున్నారో వారు ఒక గ్రమ్ ఉసిరి పౌడర్ తీసుకొని దీనికి కొంచెం పంచదార కలుపుకొని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని రోజుకు రొండు సార్లు తాగాలి.ఉసిరి వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here