చలికాలం వచ్చేస్తుంది.మీ ఆరోగ్యం కాపాడుకోవాడనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!

0
212

చలికాలం రాగానే వివిధ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. .జలుబు, శ్వాసకోశ సంబంధ సమస్యలు సర్వసాధారణంగా మారుతుంటాయి. ఇంట్లో ఆహారం కాకుండా బయట ఫుడ్స్ తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. చలికాలంలో మరింతగా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. శ్యాసకోశ వ్యాధులు, కామన్ కోల్డ్(జలుబు), గొంతు నొప్పి (ఇన్‌ఫెక్షన్) లాంటి వ్యాధులు జనాన్ని వేధిస్తాయి. నగరంలో అలర్జీ, బ్రాంకైటిస్ జబ్బుతో దాదాపు 20 శాతానికి పైగా ప్రజలు బాధపడుతున్నారు.వాహనచోదకులు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, గృహిణిలు, రోడ్లపై నడిచే వారు ఎక్కువగా ఈ జబ్బు బారిన పడుతున్నారు. ఇటీవల నుంచి నగరంలో చాలా మంది దగ్గు, ఆయాసం, గొంతునొప్పి తదితర సమస్యలను ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. వారాలు, నెలల తరబడి దగ్గు తగ్గకపోవడంతో ఇది ఆస్తమా, బ్రాంకైటిస్ వ్యాధులకు దారి తీస్తోందని హెచ్చరిస్తున్నారు. వీటి ఫై యాంటిబయాటిక్స్‌ కూడా పని చేయవు .

ఒకట్రొండు వారాలపాటు హైపర్ మందులు వాడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని, కొన్నిసార్లు ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని వైద్యులు వివరిస్తున్నారు… వాతావరణ కాలుష్యం, బహిరంగ ధూమపానం వల్ల నగరంలో గొంతు సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. గాలిలో తేమ, వాతావరణ కాలుష్యం వల్ల గొంతులో మార్పులు చోటు చేసుకుంటునట్లు వైద్యులు చెబుతున్నారు. గాలిలో సూక్ష్మ జీవుల ప్రభావం ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.ఇ చలి కాలం జాగ్రత తో పాటు కింది సూచనలు కూడా పాటిస్తే ఆరోగ్యం తో ఉండవచు .పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సిట్రస్ జాతికి చెందిన పండ్లు కూడా తీసుకోవాలి.చలికాలంలో వ్యాయామాలు చేయాలి. శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరిగి వెచ్చగా ఉంటుంది. అంతేగాకుండా రక్తప్రసరణ కూడమెరుగుపడుతుంది. చలికాలంలో ఎక్కువగా వేడి ఆహార పదార్థాలు భుజించాలి.పండ్లు..కూరగాయాలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.చలికాలంలో పరిశుభ్రంగా ఉండాలి. తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం..తీసుకొనే ఆహారాన్ని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి.చలికాలంలో చాలా మంది నీటిని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడరు. దీనివల్ల శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. చర్మం పొడిగా కూడా మారుతుంది. దాహం కాకున్నా ఆరు నుండి ఎనిమిది గ్లాసుల నీరు తాగడం మంచిది.నిత్యం వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. కరచాలనం చేయడం మానుకోవాలి. దగ్గులు, తుమ్ములు వచ్చినప్పుడు తప్పనిసరిగా చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. శుభకార్యాలకు వెళితే మాస్కులు వాడాలి. జబ్బు లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. సొంతనిర్ణయాలు తీసుకోవద్దు.చలికాలం వచ్చిందంటే.. పొగలు వచ్చే నీటితో స్నానం చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. వేడినీటితో స్నానం చేయడం వల్ల.. మీ చర్మం.. చాలా డ్యామేజ్ అవుతుంది. చర్మంలోని న్యాచురల్ ఆయిల్స్ కోల్పోయి.. డ్రైగా మారుతుంది. కాబట్టి.. చర్మం డ్రైగా మారడానికి కారణమయ్యే వీటికి దూరంగా ఉండండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here