వందేళ్లు దాటినా బామ్మ వంటల కి ప్రపంచం ఫిదా!ఆమె గురుంచి తెలిస్తే షాక్ అవతారు!

0
248

గుడివాడ…. తెనాలికి పది కిలోమీటర్ల దూరంలో ఉందీ చిన్న పల్లెటూరు. ఆ గ్రామ ప్రజలకి కృష్ణమ్మ పరవళ్లు తప్ప… ప్రపంచం తెలియదు. అసలు యూట్యూబ్‌ అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి వూరు ఇప్పుడు వందేళ్లు పైబడిన ఓ బామ్మ వల్ల యావత్‌ ప్రపంచానికి తెలిసింది. ప్రపంచ ప్రఖ్యాత ఛానల్‌ అయిన బీబీసీని సైతం ఆ వూరికి రప్పించింది. ఆ బామ్మ ఎవరో కాదు కంట్రీఫుడ్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో పొలం గట్ల మధ్య కట్టెల పొయ్యి మీద సంప్రదాయ వంటలు చేస్తున్న కర్రె మస్తానమ్మ.  ఈ బామ్మ గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలివిగో..అనుభవంతో ఉజ్జాయింపుగా వేస్తుంది. దాదాపు ఆరు నెలల్లో ఆమ్లెట్‌, రొయ్యలూ, పీతలూ, దోసకాయ చికెన్‌, బ్రెడ్‌ ఆమ్లెట్‌ వంటి వంటకాలెన్నో తనదైన శైలిలో చేసి చూపింది. అందుకే దేశ విదేశాల్లోని 42 మిలియన్ల మంది వాటిని చూశారు. ఆ ఛానల్‌కి రెండున్నర లక్షల మందికిపైనే చందాదారులుగా మారిపోయారు. నూట ఆరేళ్ల ఈ బామ్మకి దేశవిదేశాల్లో అభిమానులున్నారు. చీరలూ, గ్రీటింగు కార్డులు పంపుతున్నారు. సన్మానం చేస్తామని ఆహ్వానం అందిస్తున్నారు. అదంతా ఈ బామ్మ చేతివంట మహత్యమే.ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలికి 10 కిలోమీటర్ల దూరంలో గుడివాడ అనే పల్లెటూరులో ఉండే మస్తానమ్మ నిన్న మొన్నటి వరకూ పొలం పనులు చేసుకునేది. ఇప్పటికీ చూపు బాగా కనిపిస్తుంది. కూరగాయలు కోసినా, వంటలు వండి వార్చినా కళ్లద్దాలు అవసరం లేదు. చురుగ్గా ఉంటుంది. చకచకా నడుస్తుంది. వంటలు చేసేటప్పుడు ఆమె కూరగాయలు కత్తిపీటతో కోస్తుంది. చేస్తూనే వాటి గురించి చెబుతుంటుంది. మస్తానమ్మ పుట్టి పెరిగిందీ, అత్తారి వూరు గుడివాడే.ఆమె మనవడు లక్ష్మణ్‌ స్నేహితుడు శ్రీనాథ్‌రెడ్డితో కలిసి బామ్మని చూడటానికి వెళ్లాడు. మనవడు వచ్చాడని తానే స్వయంగా టొమాటో కూర చేసి అన్నం వండి పెట్టింది. ఆ వయసులో ఆమె చాకు కూడా లేకుండా టొమాటోను ముక్కలుగా కోయడం, వేళ్లతో అల్లం పొట్టు తీయడం వంటివి వారికి ఆసక్తిగా అనిపించాయి. పైగా కూరకూడా అద్భుతమైన రుచి. దాంతో వారి మనసులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆమె చేత ఆరుబయట వంట చేయించి యూట్యూబ్‌లో పెడితే బాగుంటుందని అనుకున్నారు. అదే విషయం మస్తానమ్మని అడిగారు. ‘పాత కాలం వంటలు మీకేం నచ్చుతాయి నాయనా’ అంటూ బోసి నోటితో నవ్వేసింది. అయినా వాళ్లిద్దరూ వదలకుండా ఆమెతో పల్లెటూరి పద్ధతితో బెండకాయ కూర చేయించారు. అదే మొదటి వీడియో. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. అలా వెంట వెంటనే మస్తానమ్మ చేత వంటలు చేయించి కంట్రీ ఫుడ్స్‌ అనే ఛానల్‌ ద్వారా పోస్ట్‌ చేయడం మొదలుపెట్టారు. వండి వార్చడంలో ఎంతో అనుభవం ఉండటంతో పొయ్యి దగ్గర కూర్చుని చకచకా చేసేస్తుంది. ఆమె చేసిన అరవై శాకాహార, మాంసాహార వంటల్లో పుచ్చకాయ చికెన్‌కు బాగా స్పందన వచ్చింది. నెలరోజుల్లో ఆరులక్షల మంది చూశారు. అలానే బెండకాయ, బ్రెడ్‌ ఆమ్లెట్‌, రోస్టెడ్‌ ప్రాన్స్‌నూ ఎక్కువ మందే వీక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here