Paritala Sunitha Given Epic Punch to All Pawan Kalyan Haters

0
1255

గత కొన్ని సంవత్సరాలుగా ఏదో స్థలం గొడవల్లో తల దూర్చాడని పరిటాల రవి పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించాడనే వార్త విపరీతంగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. దీనికి సాక్ష్యాలంటూ పవన్ కళ్యాణ్ కి గుండు కొడుతున్న ఒక ఫోటోను విపరీతంగా తన యాంటీ ఫాన్స్ షేర్లు కొట్టారు. కొన్ని మీడియా ఛానల్స్ లోను మరియు ప్రింట్ మీడియా లోను కూడా ఈ విషయం గురించి వార్తలు వచ్చాయి. అయితే ఎప్పుడూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ తరపున కానీ అటు పరిటాల వారి తరపున ఈ వార్త గురించి ఎటువంటి విషయాలు బయటకి రాలేదు. అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ తనకి పరిటాల రవి కి అసలు పరిచయం లేదని, తన గుండు తానే కొట్టించుకున్నానని మీడియా సమావేశంలో స్పష్టం చేశాడు.

ఆమె మాట్లాడిన ఎక్సక్లూసివ్ వీడియో మీకోసం..ఈ క్రింది వీడియోలో చూడండి

ఇక ఈ విషయం పై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి , పరిటాల రవి సతీమణి పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి కి అస్సలు పరిచయం లేదని , పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం నిజమేనని , పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి కి ఎటువంటి గొడవలు జరగలేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి గుండు ఎందుకు కొట్టిస్తారు ? ప్రజలు నిజాలు తెలుసుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి కోసమే పవన్ కళ్యాణ్ టీడీపీ కి సపోర్ట్ చేశారు అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇన్నాళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ పరిటాల రవి ఇష్యూ పై రెండు వైపుల నుండి స్పందన వచ్చింది.. ఇక నుండైనా ఈ విషయం పై ఎటువంటి దుష్ప్రచారం జరగదని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here